ఏపీ నూతన సీసీఎల్‌ఏ ఎవరంటే…

11

దిశ, వెబ్ డెస్క్:
ఏపీ భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల అటవీ శాఖ , సీసీఎల్‌ఏ అదనపు బాధ్యతల నుంచి ఆయనను ఏపీ ప్రభుత్వం తప్పించింది. జీఏడికి ఆయన రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు పూర్తి స్థాయిలో సీసీఎల్ ఏ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీచేసింది.