Masaba Gupta: నన్ను కనేందుకు అమ్మ చాలా కష్టాలు పడింది : మసాబా గుప్తా

by  |
Masaba Gupta: నన్ను కనేందుకు అమ్మ చాలా కష్టాలు పడింది : మసాబా గుప్తా
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా.. జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక విషయాలను తన ఆత్మకథ ద్వారా ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. ‘సచ్ కౌన్ తా’ పేరుతో రానున్న ఈ బుక్ త్వరలోనే లాంచ్ కానుండగా.. అందులో ప్రస్తావించిన ఓ విషయాన్ని ఆమె కూతురు మసాబా గుప్తా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

గర్భిణీగా ఉన్నప్పుడు నీనా గుప్తా ఎలాంటి కష్టాలు ఎదుర్కొందో వివరించింది. మసాబా కడుపులో ఉన్నప్పుడు నీనా అకౌంట్‌లో రూ.2 వేలు మాత్రమే ఉండగా, సీ-సెక్షన్ డెలివరీకి రూ.10 వేలు ఖర్చవుతుందని తెలిసి నార్మల్ డెలివరీకి సిద్ధమైందట. అయితే డెలివరీకి కొన్ని రోజుల ముందు ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు రూ.9 వేలు అకౌంట్‌లో డిపాజిట్ అవడంతో మొత్తం రూ.12 వేల ఖర్చుతో డెలివరీ పూర్తయిందని ఆత్మకథలో వివరించినట్టు మసాబా తెలిపింది.

చాలా రోజులు సింగిల్ మదర్‌గానే మసాబాను పెంచిన నీనా.. 2008లో వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకుంది. కాగా తమ ఇన్నేళ్ల వివాహ బంధంలో ప్రేమ తప్ప ఎలాంటి పాలిటిక్స్, కుట్రలకు తావు లేవని చెప్పిన వివేక్.. మసాబా తమ మ్యారేజ్‌కు ఒప్పుకుందా? అంటే, మొదట్లో కొంచెం ఆందోళన చెందవచ్చు గానీ, ఆ తర్వాత తండ్రిగా యాక్సెప్ట్ చేసిందని వెల్లడించాడు.


Next Story

Most Viewed