ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరణ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) అధికారిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నీలం సాహ్నికి ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవలే‌ ప్రభుత్వ సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. ఐదేళ్లపాటు ఎస్‌ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ&#8230; ‘నా మీద నమ్మకంతో ఎస్‌ఈసీ బాధ్యతలు అప్పగించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి [&hellip;]</p>

Neelam Sahni, AP SEC
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) అధికారిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నీలం సాహ్నికి ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవలే‌ ప్రభుత్వ సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా చేశారు. ఐదేళ్లపాటు ఎస్‌ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ… ‘నా మీద నమ్మకంతో ఎస్‌ఈసీ బాధ్యతలు అప్పగించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తా. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాగం సహకారంతో ఎన్నికలను నిర్వహిస్తామని నీలం సాహ్ని తెలిపారు.

Next Story