‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డ్స్

by  |
‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని సాంగ్స్‌ అమేజింగ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రత్యేకించి ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ ఇప్పటికే 2020 టాప్ టెన్ సాంగ్స్ లిస్ట్‌లో చేరగా.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. ఈ పాట లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ సాధించింది. శ్రీమణి, రఖీబ్ ఆలయ్ లిరిక్స్ అందించిన పాటను జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర పాడారు. బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. సినిమాలోని ‘ధక్ ధక్, రంగులద్దుకున్న’ పాటలను కూడా మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed