- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో భారీగా వెండి పట్టివేత..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం సాయం కాలం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారులో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వెండి సుమారు 400 నుంచి 500 కిలోలు ఉంటుందని సమాచారం. ఆ సమయంలో నిందితులు రాయ్ పూర్ నుంచి శేలంకు కారులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి రశీదులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద గురువారం సాయం కాలం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారులో భారీగా తరలిస్తున్న వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వెండి సుమారు 400 నుంచి 500 కిలోలు ఉంటుందని సమాచారం.
ఆ సమయంలో నిందితులు రాయ్ పూర్ నుంచి శేలంకు కారులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి రశీదులు లేని కారణంగా స్వాధీనం చేసుకున్న వెండిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story






