తెల్లచీరలో తళుక్కుమన్న నయన్.. వైరల్‌గా ఫొటోలు

by  |
తెల్లచీరలో తళుక్కుమన్న నయన్.. వైరల్‌గా ఫొటోలు
X

దిశ, సినిమా : ప్రపంచంలో ఎక్కడా కనిపించని అందమైన సంస్కృతి భారత్‌లో ఉంది. మహిళల సంప్రదాయక కట్టు, బొట్టుతో తదితర ఆచార వ్యవహారాలను ప్రజెంట్ జనరేషన్స్ తమదైన స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సంప్రదాయానికి ఆధునికతను మేళవిస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సంప్రదాయ వస్త్రాల్లో కుందనపు బొమ్మలా మెరిసింది.

మలయాళ నూతన సంవత్సరాది విషు సెలబ్రేషన్స్‌ కోసం షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న నయన్.. బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఇటీవల కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ‘విషుఅశాంసకల్’ సెలబ్రేషన్స్‌లో భాగంగా ట్రెడిషనల్ లుక్‌లో అలరించిన నయన్.. వైట్ శారీలో మ్యాచింగ్ బ్యాంగిల్స్, మల్లెపూలు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె అందాన్ని చూసి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు ఈ ఫొటోలు షేర్ చేసినందుకు గాను స్టైలిస్ట్ బిషకు నయన్ ఫ్యాన్స్ థాంక్స్ చెప్తున్నారు.

Next Story