'అమ్మోరుతల్లి'గా నయన్ 

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: సౌత్ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార మునుపెన్నడూ కనిపించని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న నయనతార ఇప్పుడు ఆదిశక్తి అవతారంలో కనిపించనున్నారు. ‘మూకుతి అమ్మన్‌’ అనే తమిళ సినిమాలో తొలిసారి దేవత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో &#8216;అమ్మోరుతల్లి&#8217;గా విడుదల చేస్తున్నారు. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సినిమా యూనిట్‌ [&hellip;]</p>

అమ్మోరుతల్లిగా నయన్ 
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ సినిమా ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార మునుపెన్నడూ కనిపించని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న నయనతార ఇప్పుడు ఆదిశక్తి అవతారంలో కనిపించనున్నారు. ‘మూకుతి అమ్మన్‌’ అనే తమిళ సినిమాలో తొలిసారి దేవత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో ‘అమ్మోరుతల్లి’గా విడుదల చేస్తున్నారు. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సినిమా యూనిట్‌ విడుదల చేసింది. తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. భక్తి పేరుతో మోసాలు చేసే కొందరి గురించి అసలు నిజాలు తెలియజేయడానికి అమ్మవారు భూమిపైకి వస్తే.. ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతోంది. నటుడు అజయ్‌ ఘోష్‌ ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు. మరి అమ్మోరు తల్లిగా నయనతార ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Next Story