ఆ సినిమా చేయడం లేదు :నయన్

by  |
ఆ సినిమా చేయడం లేదు :నయన్
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్‌స్టార్ నయనతార తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 1780-1790లలో శివలింగ ప్రాంతాన్ని పాలించిన మహారాణి వేలు నాచియార్ బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నట్లు మీడియాలో వస్తున్నదంతా న్యూస్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఇది బేస్‌లెస్ రూమర్‌ అని.. ఇలాంటివి పబ్లిష్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని కోరింది. జస్ట్ కాల్ లేదా మెసేజ్ దూరంలోనే వెరిఫికేషన్ ఉందని.. అలా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

ఈస్టిండియా కంపెనీపై పోరాటం చేసిన తొలి రాణిగా చరిత్రకెక్కిన ‘వేలు నాచియార్’ జీవితకథను డైరెక్టర్ సుశీ జెన్సన్ తమిళ్‌లో తెరకెక్కిస్తున్నారని.. 18కె స్టూడియోస్ బ్యానర్ సినిమాను నిర్మిస్తుందని మీడియాలో ప్రచారం జరిగింది. ‘వీరమంగాయ్‌ వేలు నాచియార్‌’ టైటిల్ కూడా కన్‌ఫర్మ్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో నయన్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.



Next Story

Most Viewed