- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ నక్సలైట్లు రాబోతున్నారు
<p>దిశ, దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నక్సలైట్లు రాబోతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎవరైతే దుర్మార్గపు పనులకు పూనుకుంటారో, ఎవరైతే నిరుపేదలను ముంచే ప్రయత్నం చేస్తారో వారిని అంతమొందించడానికి నక్సల్స్ బయటకు వస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో ఎటు చూసినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధియే కనిపిస్తోందన్నారు. ఎల్ఆర్ఎస్ […]</p>

దిశ, దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నక్సలైట్లు రాబోతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎవరైతే దుర్మార్గపు పనులకు పూనుకుంటారో, ఎవరైతే నిరుపేదలను ముంచే ప్రయత్నం చేస్తారో వారిని అంతమొందించడానికి నక్సల్స్ బయటకు వస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో ఎటు చూసినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధియే కనిపిస్తోందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఇండ్లను కూడా వదలడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందన్నారు. అందుకే మళ్లీ పాత రోజులు వస్తున్నాయని తెలిపారు. అందుకే మళ్లీ నక్సలైట్లు రాబోతున్నారనీ వి.హనుమంతరావు తెలిపారు. దుబ్బాక ఒక్కటి ఓడిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒరిగేదేమి లేదు కానీ కేసీఆర్‌కు బుద్ధి వస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అన్నం పెట్టే చేతుకు ఓటేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని హనుమంతరావు కోరారు.






