అగ్రరాజ్యంలో అడుగుపెట్టినా.. రాజును కాలేకపోయా : స్టార్ యాక్టర్

by  |
Nawazuddin
X

దిశ, సినిమా : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కొన్నిరోజుల కిందట షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ.. తాజాగా ఎమ్మీ అవార్డు చేజార్చుకోవడంపై తన అసంతృప్తిని పద్యరూపంలో వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌ ఫిల్మ్ ‘సీరియస్ మెన్’లో తను పోషించిన పాత్రకు ‘బెస్ట్ యాక్టర్’ కేటగిరీలో ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ‘డేస్’ డ్రామా సిరీస్‌లో పర్ఫార్మెన్స్‌కు గాను నటుడు డేవిడ్ టెన్నాంట్‌కు ఆ అవార్డు దక్కడంతో నవాజుద్దీన్ నిరాశ చెందాడు. ఈ నేపథ్యంలో తన ఫీలింగ్‌ను కవితాత్మకంగా వర్ణిస్తూ ‘న్యూయార్క్‌కు వెళ్లాను కానీ రాజును కాలేకపోయా. అవార్డు కోసం భవిష్యత్తులో మళ్లీ ప్రయత్నిస్తా’ అని తెలిపాడు.

అంతేకాదు ‘సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు. మీరు అనుకున్న పని చేయండి కానీ ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండండి’ అంటూ మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సిరీస్ చిత్రాలతో పాటు ‘సేక్రెడ్ గేమ్స్’ షోలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్.. ప్రస్తుతం కంగనా రనౌత్ నిర్మిస్తున్న ‘టికు వెడ్స్ షేరు’లో కనిపించనున్నాడు.


Next Story

Most Viewed