- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవీన్ పొలిశెట్టి రాప్ లెసన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్ : మీరు సూపర్ కూల్ రాప్ ఆర్టిస్ట్ కావాలి అనుకుంటున్నారా? అది కూడా ఐదు నిమిషాల్లో.. అయితే పదండి! మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సూచనలు, సలహాలు విందాం. ఇంతకీ ఆయనెవరని అనుకుంటున్నారా? అదేనండి మన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. తన కిచిడి ఎక్స్‌పరిమెంట్స్‌లో భాగంగా ఇందుకు సంబంధించిన పాఠాలు నేర్పుతున్న నవీన్.. కేవలం ఐదంటే ఐదు స్టెప్స్‌లో, ఐదు నిమిషాల్లోనే రాపర్‌గా మారిపోవచ్చని చెప్తున్నాడు. View this post on […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మీరు సూపర్ కూల్ రాప్ ఆర్టిస్ట్ కావాలి అనుకుంటున్నారా? అది కూడా ఐదు నిమిషాల్లో.. అయితే పదండి! మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సూచనలు, సలహాలు విందాం. ఇంతకీ ఆయనెవరని అనుకుంటున్నారా? అదేనండి మన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. తన కిచిడి ఎక్స్‌పరిమెంట్స్‌లో భాగంగా ఇందుకు సంబంధించిన పాఠాలు నేర్పుతున్న నవీన్.. కేవలం ఐదంటే ఐదు స్టెప్స్‌లో, ఐదు నిమిషాల్లోనే రాపర్‌గా మారిపోవచ్చని చెప్తున్నాడు.
సూపర్ ఫన్నీ సజెషన్స్‌తో నవీన్ పొలిశెట్టి ఏం చెప్తున్నారో తెలుసా? మాథ్స్ టేబుల్, ఫింగర్స్ పొజిషన్, చిన్న పిల్లాడి సైకిల్ చెయిన్, మన ముందున్న కెమెరాను పగలగొట్టే స్కిల్స్, మీ ఫ్రెండ్స్‌ను పేరెంట్స్ ముద్దుగా పిలిచే పేర్లు, ఒకవేళ లిరిక్స్ మరిచిపోయినా నో ప్రాబ్లమ్ అంటూ.. జస్ట్ యాటిట్యూడ్‌తో కవర్ చేయమని చెప్తున్నాడు. ఎవరైనా రాపర్ అవ్వాలి అనుకుంటే.. వెంటనే ఫాలో అయిపొండి మరి.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన నవీన్ పొలిశెట్టి.. సోషల్ మీడియాలోనూ తన వీడియోస్‌తో సూపర్ ఫన్ అందిస్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.






