ప్రేమ నుంచి చావు దాకా.. ‘నవరస’ భావోద్వేగాలతో ట్రైలర్

by  |
navarasa
X

దిశ, సినిమా : లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, జయేంద్ర నిర్మించిన ఆంథాలజీ వెబ్ సిరీస్ ‘నవరస’. సూర్య, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, పార్వతి, రేవతి, అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ కాస్టింగ్‌తో తొమ్మిది కథలను తొమ్మిదిమంది కోలీవుడ్ డైరెక్టర్లు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్ పాజిటివ్ రెస్సాన్స్ అందుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేమ నుంచి చావు వరకు తొమ్మిది భావోద్వేగాలను ట్రైలర్‌లో చూపించగా.. కొన్ని లవ్ సీన్లు ‘సూర్య, గౌతమ్ మీనన్’ కాంబోలోని క్లాసిక్ మూమెంట్స్‌ను గుర్తుచేశాయి.

అయితే ట్రైలర్‌లో స్టోరీస్ నేపథ్యాన్ని క్లియర్‌గా రివీల్ చేయనప్పటికీ.. సన్నివేశాలు ఆంథాలజీపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కాగా ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియం కానున్న ఈ వెబ్‌సిరీస్‌కు లీడింగ్ కంపోజర్లు రెహమాన్, డి ఇమాన్, గిబ్రాన్‌తో పాటు సంతోష్ శివన్, మనోజ్ పరమహంస వంటి టాప్ సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం విశేషం. ఇక ఈ సిరీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని.. కొవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు హెల్ప్ చేసేందుకు వినియోగించనున్నారు.



Next Story

Most Viewed