- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zubeen Garg: భారతీయ సింగర్ ది హత్య కాదు.. ట్విస్ట్ ఇచ్చిన సింగపూర్ పోలీసులు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు కోర్టుకు తమ నివేదికను సమర్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు (Assamese Singer) జుబిన్ గార్గ్ (Jubin Garg) అనుమానాస్పద మృతి విషయంలో మరో ట్విస్ట్ నమోదైంది. ఆయన మరణం వెనుక ఎలాంటి హత్య కోణం లేదని, లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ఆయన మరణించారని సింగపూర్ పోలీసులు బుధవారం కోర్టుకు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‍లో సింగపూర్ పర్యటనకు వెళ్లిన జుబిన్ గార్గ్ తన పర్యటనలో భాగంగా యాట్ పార్టీకి ఒక రోజు మందు స్విమ్మింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు. అయితే ఆయన మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆయనకు విషప్రయోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం జుబిన్ గార్గ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జుబిన్‍ను పక్కా ప్లాన్ తోనే హత్య చేశారని ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఈ విషయం మరింత కలకలం రేగింది. అయితే తాజాగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు (Singapore Police) కరోనర్ కోర్టుకు తమ రిపోర్టును అందజేశారు. ఇందులో స్విమ్మింగ్ కు ముందు లైఫ్ జాకెట్ ధరించాలని నిర్వాహకులు కోరగా తొలుత ధరించి ఆ తర్వాత వద్దని నిరాకరించారని తెలిపారు. ఈ క్రమంలో స్విమ్ చేస్తూ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టుకు తెలిపారు.






