జుబిన్ గార్గ్ మరణ కేసు.. డిసెంబర్ 12న SIT ఛార్జిషీట్ దాఖలు

by Malleboina Mahesh |

అస్సాంకు చెందిన ప్రముఖ సంగీతకారుడు జుబీన్ గార్గ్‌ సింగపూర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి.

జుబిన్ గార్గ్ మరణ కేసు.. డిసెంబర్ 12న SIT ఛార్జిషీట్ దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాంకు చెందిన ప్రముఖ సంగీతకారుడు జుబీన్ గార్గ్‌ (Zubeen Garg) సింగపూర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రారంభ నివేదికలు ఆయన స్కూబా డైవింగ్ ప్రమాదంలో మరణించినట్లు సూచించాయి. ఆయన సముద్రంలో ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి (drowning) మరణించినట్లు స్థానిక పోలీస్ నివేదికలు తెలిపాయి. కానీ అస్సాం ప్రభుత్వం ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఇన్వెస్టిగేషన్ చేయాలని SIT ను ఏర్పాటు చేసింది. అలాగే ఆయన అంత్యక్రియలకు ముందు మరోసారి రీ పోస్టుమార్టం (Re Postmortem) నిర్వహించింది. అనంతరం సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసి, అనుమానం ఉన్న పలువురిని అరెస్టు చేసి విచారించింది.

జుబీన్ గార్గ్‌ మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తు ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధిపతి, స్పెషల్ డీజీపీ-సీఐడీ మున్నా ప్రసాద్ గుప్తా (CID Munna Prasad Gupta) గువాహటిలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 12న కోర్టు ముందు ఛార్జిషీట్‌ను దాఖలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఛార్జిషీట్ దాఖలు అయిన తర్వాతే ఈ కేసు పూర్తి వివరాలు, లోగుట్టు బయటపడతాయని డీజీపీ గుప్తా పేర్కొన్నారు.

జుబీన్ గార్గ్‌ మరణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ముమ్మరంగా శ్రమించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు ఏకంగా 300 మంది సాక్షులను విచారించినట్లు స్పెషల్ డీజీపీ-సీఐడీ మున్నా ప్రసాద్ గుప్తా తెలిపారు. దర్యాప్తు తుది దశలో ఉన్నందున, త్వరలోనే న్యాయపరమైన చర్యలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 12న దాఖలు కానున్న ఈ ఛార్జిషీట్‌పై దేశవ్యాప్తంగా సంగీత ప్రియులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story