- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zelenskyy : ఏ తరహా చర్చలైనా సరే.. పుతిన్, ట్రంప్ కు జెలెన్ స్కీ ప్రతిపాదన
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో క్రెమ్లిన్ బలగాలు కీవ్ పై విరుచుకుపడుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో క్రెమ్లిన్ బలగాలు కీవ్ పై విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. కాగా.. రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy) కీలక ప్రతిపాదన చేశారు. పుతిన్ తో చర్చలకు సిద్ధమని అన్నారు. జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ‘‘ద్వైపాక్షిక చర్చలకు పుతిన్ (Putin)కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా సరే. ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే’’ అని ప్రతిపాదించారు. తనతోపాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) కలిసి చర్చల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్..
యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం రష్యా-ఉక్రెయిన్ 390 మందిని, శనివారం 307 మందిని ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. అయితే, ఇప్పుడు మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరోవైపు కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి ఒకేరోజు 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లలో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్ రూపొందించి షాహిద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా.. పలువురు గాయాలపాలయ్యారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ దాడులపైస్పందించారు. పుతిన్ పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, జెలెన్ స్కీ మాటల వల్లే ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని మండిపడ్డారు.






