- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky: ట్రంప్ జెలెన్ స్కీ ఘర్షణ.. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపిన దేశాలివే?
మెరికాలోని వైట్ హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని వైట్ హౌస్ (White house)లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelensky) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు స్పందించారు. యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాధినేతలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపారు. కెనడా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు సైతం కీవ్‌కు మద్దతిచ్చాయి. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి మద్దతుగా ఉంటామని తెలిపాయి. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పోరాడుతోందని వెల్లడించాయి.
ఉక్రెనియన్లకు అండగా ఉంటాం: కెనడా ప్రధాని ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin trueado) మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడి చట్టవిరుద్ధమైందిగా అభివర్ణించారు. రష్యా చట్టవిరుద్ధంగా కీవ్ పై దాడి చేసిందని విమర్శించారు. ‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం ఉక్రెయినయన్లు చేస్తున్న పోరాటం ఎంతో గొప్పది. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రెనియన్లకు కెనడా అండగా ఉంటుంది’ అని తెలిపారు. అలాగే యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వోన్ డర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్ ఒంటరిగా లేదు దేశంలో శాశ్వత శాంతి కోసం మీతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొన్నారు.
ఆలస్యం చేయకుండా యుద్ధాన్ని ముగించాలి: ఇటలీ ప్రధాని మెలోనీ
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు వీలైనంత త్వరగా సమావేశమై చర్చలు జరపాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (melony) యూరోపియన్ దేశాలకు సూచించారు. పశ్చిమ దేశాలలోని ప్రతి విభాగం అన్ని దేశాలనూ బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహామర్, స్లోవేనియా అధ్యక్షురాలు నటాసా పిర్క్, రొమేనియా తాత్కాలిక అధ్యక్షురాలు ఇలీ బోలోజన్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, సైతం ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపారు. అంతేగాక బెల్జియం, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ దేశాల నాయకులు కూడా ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.






