- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zelensky: ట్రంప్ జెలెన్ స్కీ భేటీ.. కాల్పుల విరమణపై డిస్కషన్ !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. నాటో సదస్సు సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తో భేటీ అయ్యారు. నెదర్లాండ్స్ లోని హేగ్‌లో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం దీనిని ధ్రువీకరించింది. ఇరువురు దేశాధినేతలు రష్యా ఉక్రెయిన్ కాల్పుల విరమణ గురించి చర్చించినట్టు తెలిపింది. 50 నిమిషాల పాటు వివిధ అంశాలపై డిస్కస్ చేసినట్టు పేర్కొంది. ‘ట్రంపుతో సుదీర్ఘమైన, అర్థవంతమైన చర్చలు జరిపా. అనేక కీలక అంశాలపై డిస్కస్ చేశాం. సీజ్ ఫైర్‌తో శాంతిని ఎలా నెలకొల్పాలో, ప్రజలను ఎలా రక్షించుకోవాలో అనే అంశంపై మాట్లాడాం. శాంతిని నెలకొల్పడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ట్రంపునకు కృతజ్ఞతలు’ అని జెలెన్ స్కీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జెలెన్ స్కీతో సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధాన్ని ముగించడానికి త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతానని తెలిపారు.
రక్షణ వ్వయం భారీగా పెంపు: నాటో దేశాల ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తర్వాత రక్షణ వ్యయం భారీగా పెంచేందుకు నాటో దేశాలు అంగీకరించాయి. రాబోయే 10 సంవత్సరాలలో సభ్య దేశాలన్నీ తమ జీడీపీలో రక్షణ వ్యయాన్ని 5 శాతానికి పెంచనున్నాయి. శిఖరాగ్ర సమావేశం తర్వాత సభ్య దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. అయితే దీనిపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.






