Zelensky: రేపు ట్రంప్, జెలెన్ స్కీ భేటీ.. కీలక అంశాలపై చర్చించే చాన్స్ !

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ బుధవారం భేటీ కానున్నారు.

Zelensky: రేపు ట్రంప్, జెలెన్ స్కీ భేటీ.. కీలక అంశాలపై చర్చించే చాన్స్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelensky) బుధవారం భేటీ కానున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ (Hage) నగరంలో జరిగే నాటో (Nato) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా వీరిద్దరూ సమావేశం కానున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించనున్నట్టు వెల్లడించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు సహా చమురు ధరలపైనా డిస్కస్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 నుంచి 17 వరకు కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జెలెన్ స్కీతో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.

కానీ ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో అనూహ్యంగా ట్రంప్ ముందస్తుగానే సమావేశం నుంచి వెళ్లి పోవడంతో మీటింగ్ రద్దు అయింది. ఈ క్రమంలోనే వీరు మరోసారి భేటీ కానుండటంపై ఆసక్తి నెలకొంది. కాగా, హేగ్ లో రెండు రోజుల పాటు నాటో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చించనున్నారు.

Next Story