- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky: దయచేసి ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్ స్కీ విజ్ఞప్తి
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకరంగా కొనసాగుతోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం మరోసారి భీకరంగా కొనసాగుతోంది. రెండు దేశాలు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ క్షిపణి (Balistic missile) తో దాడి చేసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు (Donald trump)నకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక విజ్ఞప్తి చేశారు. దయచేసి ఒకసారి ఉక్రెయిన్‌ను సందర్శించాలని సూచించారు. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించాలని ఆహ్వానించారు. తాజాగా జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. రష్యా దాడి వల్ల కలిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్ పర్యటన ఎంతో అవసరమని తెలిపారు.
‘ట్రంప్ ఒకసారి ఉక్రెయిన్ ను సందర్శించాలి. యుద్ధం వల్ల మా దేశంలో జరిగిన విధ్వంసాన్ని చూడాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఒప్పందంపై సంతకం చేసేముందు ఒకసారి ఉక్రెయిన్‌లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితిని గమనించాలి. ఉక్రెయిన్‌లోని ఆస్పత్రులు, చర్చిలు సందర్శించాలి. సాధారణ పౌరులు, యోధులను కలవాలి’ అని తెలిపారు. దీని వల్ల పుతిన్ చేసిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవడం వీలవుతుందని చెప్పారు. అంతేగాక అమెరికా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందో కూడా అర్థం అవుతుంది అని వెల్లడించారు. కాగా, 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానసాగుతున్న విషయం తెలిసిందే.






