‘మహిళల్ని బ్లేమ్ చేయడం ఫ్యాషనైపోయింది’.. ఇన్‌స్టాలో ధనశ్రీ సంచలన పోస్టు

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-10 17:18:46  IST  )

టీమిండియా(Team India) ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

‘మహిళల్ని బ్లేమ్ చేయడం ఫ్యాషనైపోయింది’.. ఇన్‌స్టాలో ధనశ్రీ సంచలన పోస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో రాణిస్తూ భారత జట్టుకు గత కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఫామ్ లేమితో జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. తాజాగా నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌కు చాహల్ హాజరయ్యారు. అయితే.. ఆయన ఈ మ్యాచ్‌కు మరో యువతితో రావడం హాట్ టాపిక్‌గా మారింది. చాహల్‌, ధనశ్రీ(Dhanashree) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ విడాకులు కూడా మంజూరైనట్లు మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఇక ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్ధమ‌య్యాడ‌ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో చాహల్ మరో యువతితో మ్యాచ్‌కు రావడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇదంతా పక్కన బెడితే.. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీ పెట్టిన పోస్టు మరింత సంచలనంగా మారింది. ‘ప్రతీ విషయంలో మహిళను బ్లేమ్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. చాహల్, ధనశ్రీ విడాకుల వార్తలు వైరల్ అయిన వేళ ఆమె ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మీడియాలో వస్తున్న కథనాలను ధనశ్రీ లాయర్‌ (Dhanashree lawyer) అదితి మోహన్‌ (Aditi Mohan) కొట్టిపారేశారు. వార్తలు రాసే ముందు పత్రికలు వాస్తవాన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు.





Next Story