అఖిలపక్ష బృందం నుంచి యూసఫ్ పఠాన్ ఔట్

by Shamantha N |   (  Updated:2025-05-20 13:21:32  IST  )

పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకు అఖిలపక్ష బృందం విదేశాలకు పర్యటించనుంది. అయితే, ఆ బృందంలో టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ఎంపిక ఆపార్టీ స్పందించింది.

అఖిలపక్ష బృందం నుంచి యూసఫ్ పఠాన్ ఔట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకు అఖిలపక్ష బృందం విదేశాలకు పర్యటించనుంది. అయితే, ఆ బృందంలో టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ఎంపిక ఆపార్టీ స్పందించింది. తమను సంప్రదించకుండానే యూసఫ్ ను ఎంపిక చేయడంపై స్పందించింది. దీంతో, కేంద్రానికి, టీఎంసీకి మధ్య వివాదం చెలరేగింది. అయితే, ఆ బృందం నుంచి యూసఫ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం చెలరేగిన తర్వాత కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. మమతా బెనర్జీని శాంతింపజేయడానికి ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తృణమూల్ నుండి ప్రతినిధిని సూచించమని కోరడానికే ఆమెకు ఫోన్ చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీదీ ఆమె మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ పేరుని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రతినిధిని ఎంపిక చేసే ముందు ఆమెతో సంప్రదించి ఉండాలని కిరణ్ రిజిజుతో చెప్పినట్లు సమాచారం.

యూసఫ్ పఠాన్ స్థానంలో..

అయితే, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో భాగమైన టీఎంసీ యూసఫ్ పఠాన్ స్థానంలో అభిషేక్ బెనర్జీ చేరే ఛాన్స్ ఉంది. ఆ బృందంలోనే బీజేపీకి చెందిన అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రసన్ బారువా, హేమాంగ్ జోషి సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం మే 22న విదేశాలకు బయల్దేరనుంది. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలను సందర్శిస్తుంది. . పహెల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation sindoor) గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్‌ దౌత్యయుద్ధం ప్రారంభించింది. ఇందులోభాగంగా మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గానీ, అధికారి గానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 51 మందిలో 31 మంది ఎన్డీయే నేతలు, 20 మంది ఎన్డీయేతర పార్టీల నేతలున్నారు. ‘ఒకే లక్ష్యం.. ఒకే సందేశం.. ఒకే భారత్‌’ పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.

Next Story