మా అమ్మను తాకలేరు.. షేక్ హసీనా మరణశిక్షపై తనయుడు సాజీబ్ వాజిద్

by Phanindra |

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తనయుడు సాజీబ్ వాజిద్ స్పందించారు.

మా అమ్మను తాకలేరు.. షేక్ హసీనా మరణశిక్షపై తనయుడు సాజీబ్ వాజిద్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తన తల్లి షేక్ హసీనాను చంపలేడని ఆమె తనయుడు సాజీబ్ వాజిద్ అన్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ).. హసీనాకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. మానవత్వానికి వ్యతిరేకంగా దారుణాలు చేశారని ఐసీటీ ఆరోపించింది. దీనిపై స్పందించిన వాజిద్.. యూనస్ తన తల్లిని టచ్ చేయలేడని, ఆమెను ఏమీ చేయలేడని ధీమా వ్యక్తంచేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం కాదని, అక్రమం అని వాజిద్ పేర్కొన్నారు.

ఇప్పుడు వాళ్లు తన తల్లిని చేరుకోలేరని, ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వం ఏర్పడితే ఈ తీర్పు చెత్తబుట్టలోకి వెళ్తుందని వివరించారు. బంగ్లాను ఫెయిల్డ్ స్టేట్‌లా, ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ స్టేట్‌గా యూనస్ మార్చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే షేక్ హసీనాకు రక్షణ ఉండేదా? అని ప్రశ్నించగా.. తప్పకుండా ఉండేదని వాజిద్ చెప్పారు. భారత్‌లో ‘రూల్ ఆఫ్ లా’ ఉందని, అది రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరిస్తుందని చెప్పారు.

Next Story