హాదీ అంత్యక్రియలు.. యూనస్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ అంత్యక్రియల సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

హాదీ అంత్యక్రియలు.. యూనస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ అంత్యక్రియల సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బంగ్లాదేశ్‌ ఉన్నంతకాలం హాదీ ప్రజల హృదయాల్లో జీవిస్తాడని అన్నారు. అతడి ఆదర్శాలను దేశ ప్రజలందరూ కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. హాదీ ఇచ్చిన సందేశం ఎప్పటికీ తమ చెవుల్లో మారుమోగుతూనే ఉంటుందని అన్నారు. ప్రపంచం ముందు బంగ్లాదేశ్‌ తలెత్తుకుని నిలుస్తుందని, ఎవరి వద్ద తలవంచదని వ్యాఖ్యానించారు.

గతేడాది షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హాదీపై ఈనెల ఆరంభంలో దాడి జరగగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Next Story