- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. హర్యానా పోలీసుల సంచలన ప్రకటన
దాయాది పాక్‌కు గూఢచార్యం (Espionage) చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో ఇటీవలే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో విచారణను వేగవంతం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్‌కు గూఢచార్యం (Espionage) చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో ఇటీవలే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు (Haryana Police) ఓ కీలక ప్రకటన చేశారు. జ్యోతి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs)తో సంప్రదింపులు జరిపారనే విషయం స్పష్టమైందని అన్నారు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. అదేవిధంగా ఆమెకు భద్రతా దళాల గురించి ఎలాంటి అవగాహన లేదని అన్నారు.
ఈ సందర్భంగా హిస్సార్ ఎస్పీ (Hissar SP) మాట్లాడుతూ.. అదేవిధంగా పాక్ నిఘా వర్గాలకు చెందిన వ్యక్తిని జ్యోతి వివాహం చేసుకోవాలని లేదా మతం మార్చాలని అనుకున్నట్లుగా ఆమె వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని తెలిపారు. జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వీసా ఏజెంట్ హర్కిరత్ సింగ్ (Harkirat Singh)కు చెందిన రెండు మొబైల్ ఫోన్లలో డేటా రిట్రైవ్ చేసేందుకు లాబ్‌కు పంపామని ఎస్పీ పేర్కొన్నారు.






