- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: పాక్ కు భారత్ మరో షాక్.. ఈ సారి ఏకంగా ఆర్మీ యూట్యూబ్ టార్గెట్ గా నిర్ణయం
పహెల్గాం దాడి తర్వాత పాక్ కు భారత్ వరుస షాక్ లు ఇస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ విషయంలో భారత (India) ప్రభుత్వం కఠిన వైఖరి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మత విద్వేషాలను ప్రేరేమించే కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాక్ సోషల్ మీడియా ఖాతాలపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ (Pakistan) రక్షణ శాఖ మంత్రి అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు ఆ శానికి చెందిన 16 యూట్యూబ్ చానెళ్లు, పలువురు పాకిస్తానీ జర్నలిస్టులు ట్విట్టర్ ఖాతాలను భారత్ లో బ్యాన్ చేసిన కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా పాక్ ఆర్మీ యూట్యూ చానెల్ ను (Pak Army YouTube Channel) భారత్ లో నిలిపివేసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఐఎస్ పీఆర్ (ISPR) యూట్యూబ్ చానెల్ ను బ్యాన్ చేసింది.
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని ఆందోళనలో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయంగా భారత్ పై విషయం కక్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ ను రెచ్చగొట్టేలా, ఉద్రిక్తతలకు దారి తీసేలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకునే ప్రయత్నాలను కేంద్రం గుర్తించింది. దీంతో ఆ దేశ సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచి ఈ మేరకు చర్యలకు దిగుతోంది.






