- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన సెగ.. చొక్కాలు విప్పి ఆందోళన
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ వద్ద శుక్రవారం భారత యువ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ (AI) సమ్మిట్ వద్ద శుక్రవారం భారత యువ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. భారత్-అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. తమ చొక్కాలు విప్పి, అర్ధనగ్నంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు యువ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
సమ్మిట్ వద్ద ఉద్రిక్తత..
‘ప్రధాని మోడీ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు. అమెరికాతో కుదుర్చుకుంటున్న ఈ వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశ రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. దీనివల్ల కేవలం అమెరికాకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. దేశ యువత గొంతుకను వినిపించడమే మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో మాకు ఎక్కడైనా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది’ అని ఉదయ్ భాను చిబ్ స్పష్టం చేశారు. ప్రధాని 'కాంప్రమైజ్డ్' అయ్యారంటూ ప్లకార్డులు పట్టుకుని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసనలతో భారత్ మండపం పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






