AI సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన.. కీలక సూత్రధారి అరెస్ట్

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయ‌కులు చొక్కాలు విప్పి నిరసన తెలిపిన కేసులో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

AI సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసన.. కీలక సూత్రధారి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయ‌కులు చొక్కాలు విప్పి ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర‌స‌నకు సూత్రదారి అయిన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పిటికే ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా ఇది ఎనిమిదో అరెస్ట్ అని పోలీసులు వెల్లడించారు.

దాదాపు 20 గంటలపాటు విచారించిన తరవాత యూత్ కాంగ్రెస్ చీఫ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తుకు ఆయన సహకరించడంలేదని అన్నారు. ఇక ఈ కేసులో నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగికి హాని కలిగించడం, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకోవడం లాంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ పోలీసులు ఉదయ్ భానును తెల్లవారుజామున 4:30 గంటలకు అదుపులోకి తీసుకుని దాదాపు 20 గంటలు కస్టడీలో పెట్టారు.

Next Story