Viral video: రీల్స్ కోసం రైల్లో యువతి వెకిలి చేష్టలు, పిచ్చి డాన్సులు వైరల్.. చివరికి ఏమైందంటే?

by Ramesh Naini |

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది యువత వింత పోకడలు పోతున్నారు.

Viral video: రీల్స్ కోసం రైల్లో యువతి వెకిలి చేష్టలు, పిచ్చి డాన్సులు వైరల్.. చివరికి ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది యువత వింత పోకడలు పోతున్నారు. (Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్, లైకుల కోసం ప్రమాదకరమైన స్టంట్స్ వేస్తున్నారు. పబ్లిక్‌ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, తమ ప్రాణాలనే కాకుండా ఇరుల ప్రాణాల మీదకు తేవడం చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం యువతకు (Reels crazy) రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరిందనడంలో ఆశ్చర్యం లేదు. వేగంగా వెళ్తున్న ట్రైన్స్‌లో దాని పరిసర ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళనాడుకు చెందిన యువతి వేగంగా వెళ్తున్న ఓ ట్రైన్‌లో డోర్ వద్ద వెలాడుతూ ప్రమాదకరంగా స్టంట్స్ చేసింది. అంతే కాకుండా వెలాడుతూ వెకిలి చేష్టాలతో డాన్సులు చేసింది. కొంచెం పట్టు జారీన కింద పడిపోయే విధంగా ఆమె డోర్ వద్ద హ్యాండిల్స్ సాయంతో పట్టుకోని నవ్వుతూ డాన్స్ చేసింది.

యువతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించిన నెటిజన్లు రైల్వే శాఖకు, తమిళనాడు పోలీసులకు యువతి వీడియోను ట్యాగ్ చేశారు. ఈ యువతి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయని, ఇలాంటి రిస్క్ వీడియోలు చేయడం వల్ల నీ ప్రాణాలకే ప్రమాదం అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇలాంటి వెర్రి పనులు చేయొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల దెబ్బకు తమిళనాడుకు చెందిన ఆ యువతి స్పందించింది. వీడియో వైరల్ కావడంతో తనకు కష్టంగా మారిందని, అలా డోర్ వద్ద డాన్సులు చేయడం తప్పని తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకోసారి ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చేయనని, తనను క్షమించాలని నెటిజన్లను కోరింది. వీడియో కూడా డిలీట్ చేసినట్లు యువతి స్పష్టం చేసింది.

Next Story