- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరువు హత్య... లవర్ మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి
మహారాష్ట్రలో జరిగిన ఓ పరువు హత్య వ్యవహారం హృదయవిదారకంగా ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో జరిగిన ఓ పరువు హత్య వ్యవహారం హృదయవిదారకంగా ముగిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఓల్డ్ గంజ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల దళిత యువకుడు సక్షమ్, ఆంచల్ అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో.. కులాలు వేరు కావడంతో పరువు పోతుందని భావించిన ఆంచల్ తండ్రి, సోదరుడు మరో ముగ్గురు బంధువులతో కలిసి నవంబర్ 27న సక్షమ్‌ను దారుణంగా కొట్టారు.
తీవ్రంగా గాయపడిన సక్షమ్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ప్రాణాలు విడిచాడు. అయితే సక్షమ్ అంత్యక్రియల రోజు ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. "అతడు జీవించి ఉన్నా, చనిపోయినా నా భర్తే" అంటూ మృతదేహానికి కుంకుమ రాసి, మంగళసూత్రం ధరించి, సింధూరం పూసుకుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సక్షమ్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, వారి కోడలిగా ఇక్కడే ఉంటానని ప్రకటించింది. సక్షమ్ తల్లి ఆంచల్‌ను కూతురిలా ఆలింగనం చేసుకుని ఆదరించారు.
కాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను (తండ్రి, సోదరుడు సహా) అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తమకు నాకు న్యాయం కావాలని, హంతకులకు ఉరిశిక్ష పడాలి, అప్పుడే తన భర్త ఆత్మ శాంతిస్తుందని ఆ యువతి అధికారులను కోరింది. అయితే ఈ పరువు హత్య ఘటన మహారాష్ట్రలో తీవ్ర సంచలనం రేపింది.






