- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Highway: అర్థరాత్రి హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని!
మద్యం మత్తులో కొంత మంది హంగామా క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మందు తాగిన కిక్కులో ఓ యువతి అర్ధరాత్రి హైవేపై రచ్చ రచ్చ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో కొంత మంది హంగామా క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మందు తాగిన కిక్కులో (Drunk young women) ఓ యువతి అర్ధరాత్రి హైవేపై రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో చూపించిన ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని (Haridwar) హరిద్వార్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎర్రటి సల్వార్ కమీజ్ డ్రెస్ వేసుకున్న యువతి అర్ధరాత్రి డెహ్రాడూన్, ఢిల్లీ హైవే పై నడుస్తూ.. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు చుక్కలు చూపించింది. హైవేపై వచ్చే కార్లు, బైకులను అడ్డుకుంటుంది. ఓ స్కూటీని ఆపి.. వెనుక సీట్లో కూర్చుంది. మరోవైపు అకస్మాత్తుగా ఓ కారును ఆపి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆమె సడన్‌గా ఓ కారును ఆపడంతో రెండు కార్లు స్వల్పంగా ఢీకొన్నాయి. ఇది గమనించిన కొంత మంది పాదాచారులు తమ ఫోన్‌లలో వీడియోలు తీశారు.
మరోవైపు యువతితో కొందరు మాట్లాడే ప్రయత్నం చేయబోయారు. అప్పటికే ఆమె అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రవర్తన పై నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుందా? అని నెటిజన్లు ప్రశ్నించారు. కాగా, ఆ మహిళ గుర్తింపు ఇంకా తెలియరాలేదు. ఆమె నిజంగా మద్యం మత్తులో ఉందా లేదా అనేది కూడా నిర్ధారించబడలేదు. రాత్రి మద్యం మత్తులో యువతి వీరంగం సృష్టించిందని, మహిళపై చర్యలు తీసుకోవాలని హరిద్వార్ పోలీసుల అధికారిక ఎక్స్ హ్యాండిల్‌కు వీడియోను యూజర్లు షేర్ చేశారు. ఈ వీడియో పై పోలీసులు ఇంకా స్పందించలేదు.






