Viral Video: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. భర్తతో గార్భా డాన్స్ చేస్తూ గుండెపోటుతో 19 ఏళ్ల మహిళ మృతి

by Ramesh Naini |

ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా మరణాలు అధికమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Viral Video: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. భర్తతో గార్భా డాన్స్ చేస్తూ గుండెపోటుతో 19 ఏళ్ల మహిళ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో గుండెపోటు (heart attack) కారణంగా మరణాలు అధికమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో పెద్దవారిలో ఎక్కువగా కనిపించిన ఈ సమస్య, ఇప్పుడు యువతను కూడా విడిచి పెట్టడం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు వరకు చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా డాన్స్ చేస్తూ గుండెపోటుతో వివాహిత మృతి చెందిన వీడియో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తగా పెళ్లైన 19 ఏళ్ల ఒక మహిళ తన భర్తతో కలిసి (Garba dance) గర్బా నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైరల్ వీడియోలో వివాహిత నృత్యం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిన దృశ్యాలు చూడొచ్చు.. గుడిలో అమ్మవారి ముందు మహిళ తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా నృత్యం చేస్తోంది. అక్కడే ఉన్న వారు వారిని చూసి ఎంతో ఆనందించారు. అలా ఆనందించే లోపు మహిళ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. గుండెపోటు రావడంతో చనిపోయింది. దీంతో కొత్తగా పెళ్లి అయిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం కావడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైరల్ వీడియో ఇదే..

Next Story