- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్‌పై వెంట్రుకలు లాగి హింసించిన పోలీసులు.. నొప్పితో అరుస్తున్నా వదలకుండా టార్చర్.. ప్రాణాలు వదిలిన యువకుడు..
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్వార్‌కు చెందిన యువకుడు అమిత్ సైనీ పోలీసుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో అరెస్ట్ అయిన అమిత్.. జైలు నుంచి విడుదలయ్యాక..

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్వార్‌కు చెందిన యువకుడు అమిత్ సైనీ పోలీసుల టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం కేసులో అరెస్ట్ అయిన అమిత్.. జైలు నుంచి విడుదలయ్యాక.. మొబైల్ ఫోన్, వాలెట్ తెచ్చుకునేందుకు శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న సదర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసులు.. తిట్టడంతోపాటు ప్రైవేట్ పార్ట్‌పై ఉన్న వెంట్రుకలను బలవంతంగా లాగి టార్చర్ పెట్టారు. మరో 16 దొంగతనం కేసులు అంగీకరించాలని హింసించారు. నొప్పితో అరుస్తున్నా వదలకుండా అవమానించారు.
ఈ ఘటన అమిత్‌ను తీవ్రంగా కలిచివేయగా.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు పేజీల సూసైడ్ నోట్ రాసిన మృతుడు.. ఇందులో సదర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులతో సహా ఆరుగురు వ్యక్తులను తన మరణానికి కారణమని పేర్కొన్నాడు. ఈ నోట్‌లో శివుడు తనకు న్యాయం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమిత్‌తోపాటు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన పదహారేళ్ల మైనర్ పోలీసులు చేసిన టార్చర్ గురించి వివరించాడు.






