బ్రేకింగ్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో యంగ్ హీరో ఓటమి

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో యంగ్ హీరో ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు ఓటర్లు ఊహించని షాకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోతున్న జేడీఎస్‌కు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ ఓటమి పాలయ్యారు. రామనగర అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నిఖిల్.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక, ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారుతుందనుకున్న జేడీఎస్‌కు ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. ఇక అంచనాలకు మించి రాణిస్తోన్న కాంగ్రెస్ భారీ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది.

Also Read...

కర్నాటక రిజల్ట్స్: కాంగ్రెస్‌కు షాక్.. సోనియా గాంధీ ప్రచారం చేసిన చోట హస్తం ఓటమి

Next Story

Most Viewed