- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు నాకు నీతులు నేర్పుతారా? కేసీ వేణుగోపాల్‌పై అమిత్ షా ఫైర్
మీరు నాకు నీతులు నేర్పుతారా? కేసీ వేణుగోపాల్‌పై అమిత్ షా ఫైర్. గుజరాత్ హోంమంత్రిగా అరెస్టవ్వలేదా? అన్న ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం.

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 30 రోజులపైగా జైల్లో ఉన్న మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో నీతి, విలువలను పునరుద్ధరించేందుకే ఈ బిల్లును తెచ్చినట్లు ఆయన చెప్పారు. దీనిపై విమర్శలు చేసిన వేణుగోపాల్.. అమిత్ షాను నేరుగా టార్గెట్ చేశారు. 2010లో సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో షా అరెస్టయిన ఘటనను ఉదహరించారు.
‘గుజరాత్ హోంమంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు అరెస్టయ్యారు. అప్పుడు ఆయన నీతిని నిలబెట్టారా?’ అని వేణుగోపాల్ విమర్శించారు. దీంతో చిర్రెత్తిన అమిత్ షా వెంటనే లేచి వేణుగోపాల్‌కు సమాధానమిచ్చారు. ‘ఆ సమయంలో నన్ను ఫేక్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. అయినా సరే నేను రాజీనామా చేశాను. నిర్దోషిగా బయటకు వచ్చేంత వరకు ఒక్క రాజ్యాంగబద్ధ పదవిని కూడా చేపట్టకుండా ఉండిపోయాను. మీరొచ్చి నాకు నీతులు నేర్పుతారా?’ అని మండిపడ్డారు.






