Baba Siddique's son: బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ కు బెదిరింపులు

by Shamantha N |

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique)కి కుమారుడు జిషాన్ సిద్ధిఖీకి బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది.

Baba Siddiques son: బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ కు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique)కి కుమారుడు జిషాన్ సిద్ధిఖీకి బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ని బెదిరిస్తూ మెయిల్స్ పంపారు. జిషాన్‌ సిద్ధిఖీకి(Zeeshan Siddique) బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందులో ‘నీ తండ్రి లాగానే నిన్నూ చంపేస్తాం’ అని ఉంది. అలా కాకూడదంటే రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఆరు గంటలకు ఒక బెదిరింపు మెయిల్‌ను పంపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇక, ఈ బెదిరింపులపై జిషాన్‌ మాట్లాడుతూ.. ‘డి’ అనే కంపెనీ నుంచి ఈ మెయిల్‌ వచ్చిందని తెలిపారు. అందులో పోలీసులను సంప్రదించవద్దని హెచ్చరించారని వెల్లడించారు. మరోవైపు, గత ఆరు నెలలుగా, జిషాన్ సిద్ధిఖీకి హత్య బెదిరింపులు వస్తున్నాయి. డబ్బు డిమాండ్ చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నవారి నుంచే బెదిరింపులు వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధం ఉందని భావిస్తున్నారు.

బాబా సిద్ధిఖీ హత్య కేసు..

గతేడాది అక్టోబరులో ముంబైలో బాబా సిద్ధిఖీ దారుణ హత్య జరిగింది. తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య తామే చేశామని లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన షూటర్‌గా అనుమానిస్తున్న శివకుమార్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉందని విచారణలో అంగీకరించాడు. అన్మోల్ బిష్ణోయ్ సూచనల మేరకే ఈ హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Next Story