- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China : అమెరికా- చైనా మధ్య ముదురుతున్న వాణిజ్యయుద్ధం
అమెరికా- చైనా మధ్య టారీఫ్ యుద్దం జరుగుతోంది. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరివరకు పోరాడటానికి తాము సిద్ధమేనని చైనా పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా- చైనా మధ్య టారీఫ్ యుద్దం జరుగుతోంది. అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరివరకు పోరాడటానికి తాము సిద్ధమేనని చైనా పేర్కొంది. చైనా దిగుమతులపై 20 శాతం సుంకాలు (Tariffs on China) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న చర్యలపైనే బీజింగ్ ఈ విధంగా స్పందించింది. అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం దీనిపై మాట్లాడుతూ.. ‘‘అగ్రరాజ్యం మాతో యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంటే.. అది సుంకాలైనా, వాణిజ్య యుద్ధమైనా మరే రకమైన యుద్ధమైనా చివరివరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ప్రకటించింది. తమపై విధిస్తున్న టారీఫ్‌లకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపైనా 10-15 శాతం సుంకాలు విధిస్తామని తెలిపింది.
డ్రగ్స్ స్మగ్లింగ్ లో విఫలం
మరోవైపు, ఫెంటనిల్ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమైందని ట్రంప్ పేర్కొంటున్నారు. ఆ విషయంలో బీజింగ్ విఫలమవడం వల్లే టారిఫ్‌లను(Tariffs on China) రెట్టింపు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా.. ఫెంటనిల్ స్మగ్లింగ్ దాని సొంత పనే అని డ్రాగన్ ఆరోపించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ దీనిపై స్పందిస్తూ..‘‘ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అడ్డుకోవడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా అమెరికా మమ్మల్నే నిందిస్తోంది. టారీఫ్ ల పేరుతో ఒత్తిడి చేసి.. బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు వారికి సాయం చేసినందుకు మమ్మల్నే శిక్షిస్తున్నారు’’ అని పేర్కొంది. ప్రపంచ దేశాలపై టారీఫ్ లు, బెదిరింపు స్ట్రాటజీలు తమపై ప్రబావం చూపవని తెలిపింది. అయితే, బుధవారం జరిగిన అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ప్రకటించారు.






