ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యోగి సర్కార్!

by Geesa Chandu |   (  Updated:2024-09-03 11:07:43  IST  )

మానవ్ సంపద పోర్టల్ లో.. తమ ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయని ఉత్తర ప్రదేశ్ లోని 2,44,565 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించలేదు.

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యోగి సర్కార్!
X

దిశ, వెబ్ డెస్క్: మానవ్ సంపద పోర్టల్ లో.. తమ ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయని ఉత్తర ప్రదేశ్ లోని 2,44,565 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించలేదు. వీరికి ఆగస్ట్ నెల జీతం నిలిచిపోయింది. యూపీ ప్రభుత్వ కొత్త ఆర్డర్ ప్రకారం.. ఉద్యోగులు ఆగస్టు 31 లోగా మానవ్ సంపద పోర్టల్ లో తమ స్థిర, చర ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయాలి. కానీ చివరి తేదీ దాటినా వారు అప్లోడ్ చేయలేదు.

అయితే, యూపీలో మొత్తం ప్రభుత్వ విభాగాల్లో.. 8,46,640 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కాగా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగుల తరహలో, తమ ఆస్తుల వివరాలను ఆగస్టు 31 లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని యూపీ ప్రభుత్వ సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ వివరాలు ఇవ్వని సమక్షంలో జీతాలు నిలిపివేస్తామని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇందులో ఉపాధ్యాయులు, కార్పొరేషన్స్, అటానమస్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. అయితే సీఎస్ ఆదేశాల తర్వాత కేవలం 6.02 లక్షల మంది మాత్రమే తమ వివరాలను వెల్లడించారు. అయితే తమ వివరాలను పొందుపరచని ఉద్యోగులపై.. యూపీ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

Next Story