- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asian: నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్.. ఇండియా చుట్టూ సంక్షోభాలు.. ఆసియాలో అసలేం జరుగుతోంది?
భారత దేశం సరిహద్దు దేశాల్లో వరుస రాజకీయ సంక్షోభాలు టెన్షన్ పెట్టిస్తున్నాయి.

దిశ,డైనమిక్ బ్యూరో: హిమాలయ దేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం (Nepal crisis) మరింత ముదురుతోంది. జెన్ జీల ఆందోళనల (Gen Z protests) నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) రాజీనామా చేసినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఆయన ఏక్షణమైనా దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక మంత్రులు, రాజకీయ నాయకుల ఇండ్లకు ఆందోళన కారులు నిప్పు పెడుతున్నారు. వారి ఇండ్లను లూటీ చేస్తున్నారు. నేపాల్ లో పరిస్థితి ఇలా ఉంటే అంతకు ముందు బంగ్లాదేశ్ లోనూ ఇలాంటి అల్లర్లే చెలరేగడం, దానికంటే ముందుశ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం ఆసియా ఖండంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చైనా- వియత్న మధ్య ఉద్రిక్తతలు, ఇటీవలే థాయ్ లాండ్ లో ఆందోళనతో ఆ దేశ ప్రధాని మార్పు నేపథ్యంలో ఆసియా ఖండంలో ఏం జరుగుతోందనే చర్చ తెరమీదకు వస్తోంది.
ఆసియాలో వరుస రాజకీయ సంక్షోభాలు:
ఆసియా ఖండంలోని దేశాల్లో వరుస ఉద్రిక్తతలు (political unrest in Asia) టెన్షన్ పెట్టిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం బంగ్లాదేశ్ లో మొదలైన అల్లర్లు ఆ దేశంలో రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి. అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు చిలికి చిలికి గాలివానగా మారింది. ఆందోళనకారులను కాల్చి చంపడంతో ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసినా ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. అంతుకు ముందే అప్రమత్తమైన హసినా 5 ఆగస్టు 2025న ఆ దేశం విడిచి పారిపోయి భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. మరోవైపు వియత్నం, చైనా మధ్య ఘర్షణ నివురుగప్పిన నిప్పులా నిత్యం మండుతూనే ఉన్నాయి. గత జూన్ లో థాయ్ లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రకు వ్యతిరేకంగా లక్షలాది థాయి ప్రజలు నిరసనకు దిగారు. ఇటీవలే అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను పదవి నుంచి తొలగించింది. ఇక 2022 లో సంభవించిన ఆర్థిక సంక్షోభం శ్రీలంకను అల్లకల్లోలం చేసింది. అక్కడి ప్రజలు ఆందోళనకు దిగడంతో ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినా ఆందోళన కారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రధాని మహింద రాజపక్స, అతని తమ్ముడు దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటికి నిప్పుు పెట్టారు. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలటరీ జెట్‌లో దేశం విడిచి పారిపోయారు. 2021 లో తాలిబన్లు తన ప్రభుత్వాన్ని పడగొట్టడంతో అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అష్రఫ్ ఘని కూడా దేశం విడిచిపారిపోయారు. మరో వైపు అనేక సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ కు బలూచిస్తాన్ వేర్పాటువాదులు చాలెంజ్ చేస్తూనే ఉన్నారు. ఆసియా ఖండంలోని దేశాలు ఇలా వరుసగా రాజకీయ సంక్షోబంలోకి నెట్టబడటం అలజడి రేపుతోంది.
భారత్ చుట్టూ సంక్షోభాలే:
నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన జెన్ జెడ్ ఉద్యమం కాస్తా ప్రధాని కేపీ శర్మ ఓలి దిగిపోవాలి అనే నినాదం వైపు మళ్లడం అందరిని షాక్ కు గురిచేస్తోంది. నేపాల్ ఆందోళనల వెనుక అమెరికా ఉందనే అనుమానాలను సైతం పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా నేపాల్ లో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టగా ఓలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ప్రాజెక్టులకు బ్రేకులు పడ్డాయని దీంతో ఓలికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని అమెరికానే నిడిపిస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు భారత్ లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవన్నీ భారత్ తో సరిహద్దు దేశాలు కావడంతో అక్కడ జరిగే అల్లర్ల ప్రభావం మన దేశం వైపు పాకకుండా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆసియా ఖండంలో తలెత్తుతున్న ఈ రాజకీయ ఆందోళనలు భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి మరి.






