Yemen: ఇజ్రాయెల్‌పై యెమన్ డ్రోన్ దాడి.. తిప్పికొట్టిన ఇజ్రాయెల్ సైన్యం

by B.Srinivas |

ఇజ్రాయెల్‌పై యెమన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై అనేక డ్రోన్లను ప్రయోగించినట్టు ఐడీఎఫ్ తెలిపింది.

Yemen: ఇజ్రాయెల్‌పై యెమన్ డ్రోన్ దాడి.. తిప్పికొట్టిన ఇజ్రాయెల్ సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై యెమన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై అనేక డ్రోన్లను ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. యెమన్ భూభాగం నుంచి వచ్చిన మూడు డ్రోన్లను అడ్డగించామని, వాటిలో రెండు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే ముందు ధ్వంసమయ్యాయని పేర్కొంది. ఈ దాడుల తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వార్నింగ్ సైరన్స్ మోగించింది. ఐలాట్ సమీపంలోని రామన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక డ్రోన్ దాడి జరగగా పలు విమానాలు నిలిచిపోయినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. కాగా, హౌతీల ప్రధాని అహ్మద్ అల్-రహ్వీని ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత తాజా దాడులు జరగడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు పాలస్తీనాకు మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పై పలు మార్లు దాడులు చేశారు.

Next Story