Yediyurappa: మాజీ సీఎం యడ్యూరప్పకు ఊరట.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

by Shiva |   ( Updated:2025-02-07 06:55:17.0  )
Yediyurappa: మాజీ సీఎం యడ్యూరప్పకు ఊరట.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక మాజీ సీఎం, బీజేపీ సినియర్ నేత బీఎస్ యడ్యూరప్ప (Yediyurappa)కు పోక్సో కేసులో కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ (FIR)ను కొట్టివేయాలన్న యడ్యూరప్ప (Yediyurappa) అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తనపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 2022లో ఫిబ్రవరిలో 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ (FIR) ను క్వాష్ చేయడంతో పాటు తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని యడ్యూరప్ప (Yediyurappa) హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అదేవిధంగా కేసు ట్రయల్ సమయంలో విచారణ ఎదర్కొవడం తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొంది.

Advertisement
Next Story