Yashwanth: యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీ నిజమే.. సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ రిపోర్ట్ !

by B.Srinivas |

జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో నగదు రికవరీకి సంబంధించిన కేసుపై ఏర్పాటైన సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ కీలక విషయాలను వెల్లడించింది.

Yashwanth: యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీ నిజమే.. సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ రిపోర్ట్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ (Yashwanth varma) నివాసంలో నగదు రికవరీకి సంబంధించిన కేసుపై ఏర్పాటైన సుప్రీంకోర్టు (Supreme court) అంతర్గత కమిటీ కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. యశ్వంత్ పై వచ్చిన ఆరోపణలను నిజమని తేల్చింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) కు అందజేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రిపోర్టు అనంతరం జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని కోరినట్టు వెల్లడించాయి. ఆయన రిజైన్ చేయకపోతే అభిశంసనపై రాష్ట్రపతికి సిఫార్సు చేయనున్నట్టు పేర్కొన్నాయి. ఈ విషయంపై వర్మకు శుక్రవారం వరకు సీజేఐ టైం ఇచ్చినట్టు సమాచారం.

కాగా, మార్చి 14న ఢిల్లీలోని వర్మ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయన ఇంట్లో భారీగా నగదును గుర్తించారు. అనేక డబ్బు కట్టలు కాలిపోయినట్టు గమనించారు. అనంతరం వర్మపై తీవ్ర అవినీతి ఆరోపణలు రాగా దీనిపై దర్యాప్తు చేపట్టడానిని సీజేఐ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కమిటీ తాజాగా నివేదికను అందజేసింది.

Next Story