- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన పాస్టర్
చండీగఢ్‌లోని సెక్టార్ 63లో ఉన్న తన నివాసంలో బజీందర్ తనపై లైంగిక దాడి చేశాడని, అంతే కాకుండా ఆ సమయంలో దాన్ని రికార్డు కూడా చేశాడని బాధితురాలు ఆరోపించింది.

- మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
- కేసును విచారించిన మొహలీ కోర్టు
- 2018లో ఢిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు
- కోర్టు ఎదుట బజీందర్ సింగ్ మద్దతుదారుల ఆందోళన
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో స్వయం ప్రకటిత ప్రవక్త, పాస్టర్ బజీందర్ సింగ్‌ను మొహలీ హైకోర్టు దోషిగా తేల్చింది. 2018లో జరిగిన ఈ కేసుకు సంబంధించిన విచారణ ముగియడంతో, శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. లైంగిక దుష్ప్రవర్తనకు గాను పాస్టర్ బజీందర్ దోషిగా నిర్ధారించడంతో అతడిని జైలుకు తరలించారు. మరోవైపు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో ఐదుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2018లో పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించిన విచారణ కోసం మార్చి 19న పాస్టర్ బజీందర్ సింగ్‌తో సహా ఆరుగురు నిందితులు మొహలీ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా బజీందర్ సింగ్ మద్దతుదారులు నిరసనలు చేపట్టే అవకాశం ఉందనే అనుమానంతో కోర్టు లోపల, వెలుపల 150 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
చండీగఢ్‌లోని సెక్టార్ 63లో ఉన్న తన నివాసంలో బజీందర్ తనపై లైంగిక దాడి చేశాడని, అంతే కాకుండా ఆ సమయంలో దాన్ని రికార్డు కూడా చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ సంఘటన గురించి చెప్పినా, తన డిమాండ్లను నెరవేర్చకపోయినా సోషల్ మీడియాలో సదరు వీడియోను వైరల్ చేస్తానని బెదించినట్లు బాధితురాలు చెప్పింది. అయితే అదే ఏడాది అరెస్టు జరిగిన తర్వాత బజీందర్‌కు బెయిల్ మంజూరయ్యింది. అయితే బజీందర్ సింగ్ బెయిల్ కండిషన్లను విస్మరించి లండన్ వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మొహలీ కోర్టు బజీందర్‌ను దోషిగా ప్రకటించడంతో బాధితురాలు, ఆమె కుటుంబం తమకు న్యాయం జరిగిందని చెప్పారు.
నిందితులు తనను అనేక సార్లు బెదిరింపులకు గురి చేశారని.. కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని.. కానీ తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎనిమిదేళ్లు వేచి చూసినట్లు తెలిపారు. పాస్టర్, అతని భార్య మూడు సార్లు తమకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయించారని బాధితురాలి భర్త సరబ్‌జిత్ సింగ్ పేర్కొన్నాడు. కాగా, బజీందర్‌ను రోపర్ జైలుకు తరలించారు.
పాస్టర్ బజీందర్ సింగ్‌పై ఇటీవల కాలంలో కూడా లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. మూడు రోజుల క్రితం కూడా అతడికి చెందిన వీడియో వైరల్‌గా మారింది. బజీందర్ తన ఆఫీసులో ఒక మహిళ, ఒక పురుషుడిపై ఫోన్, బుక్ విసరడం ఆ వీడియోలో కనిపించింది. సదరు మహిళ బజీందర్ చర్చిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. బజీందర్ తన చర్చిలో వలంటీర్లుగా పని చేసే ఒక మహిళ, ఇద్దరు బాలికను వేధింపులకు గురి చేశాడని.. వారిని కొట్టాడనే ఆరోపణలు చేస్తూ సదరు మహిళ రాజీనామా చేసింది.






