- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi election results: యమునా నది శాపం వల్లే ఆప్ ఓడిపోయింది- మనోజ్ తివారీ
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో (Delhi election results) బీజేపీ (BJP) విజయం దిశగా సాధించింది. కాగా.. ఓటమి పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పై కాషాయపార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో (Delhi election results) బీజేపీ (BJP) విజయం దిశగా సాధించింది. కాగా.. ఓటమి పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పై కాషాయపార్టీ విమర్శలు గుప్పిస్తోంది. యమునా నది శాపం వల్లే కేజ్రీవాల్ పార్టీ ఓడిపోయిందంటూ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయం. త్వరలో రాజధానిలో మా సర్కారు కొలువుదీరనుంది. కేజ్రీవాల్ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. మంచి నీటికి బదులుగా మద్యాన్ని పంపిణీ చేశారు. యమునా నది శాపం వారికి తగిలింది. కాంట్రాక్టు కార్మికులు, ఉపాధ్యాయులు జీవితాలను నాశనం చేశారు. బస్సు డ్రైవర్లను తొలగించి.. వారి పెన్షన్‌ను నిలిపివేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను ప్రజలకు అందనివ్వకుండా అడ్డుపడ్డారు. మా ప్రభుత్వం ఏర్పాటుచేశాక.. తొలి కేబినెట్ సమావేశంలో ఆరోగ్య పథకాల అమలుపై దృష్టిసారిస్తుంది’’ అని మనోజ్ తివారీ అన్నారు.
సీఎం ఎవరనేదానిపై..
యమునా నదిని పరిశుభ్రంగా మారుస్తామని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నదీ తీరాలకు వెళ్లేలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నదిలో మునిగే అంత శుభ్రంగా యమునాను మారుస్తామన్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి అంశంపై బీజేపీ అతిత్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. 20 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే సీఎంగా నియమించే అవకాశం ఉంటుందన్నారు. కేజ్రీవాల్ ఇక పంజాబ్‌కు పారిపోక తప్పదని విమర్శించారు.






