- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకర స్థాయిలో యమునా.. హై అలర్ట్ ప్రకటన
భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో యమునా నది ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీలో నది ఉధృతి ప్రమాదకరంగా ఉండటంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో యమునా నది ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీలో నది ఉధృతి ప్రమాదకరంగా ఉండటంతో పరివాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్ అప్రమత్తమైంది. అత్యవసర సహాయ చర్యల నిమిత్తం 30 పడవలను సిద్ధం చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. యమునా నది ఉద్ధృతి కారణంగా 20 గ్రామాలపై వరద ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
ప్రస్తుతం ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నది నీటిమట్టం 204.60 మీటర్లుగా ఉండగా.. రేపటికి 206 మీటర్లకు చేరుకుంటుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. హత్నికుండ్ బ్యారేజీ నుండి దాదాపు 127,030 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. వజీరాబాద్ ప్రతి గంటకు 45,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ఈ బ్యారేజీల నుంచి విడుదలయ్యే నీరు యమునా నదిని చేరుకునేందుకు 48-50 గంటల సమయం పడుతుంది. రేపు మధ్యాహ్నానికి నది నీటిమట్టం పెరిగితే సమీప గ్రామాలకు వరద వచ్చే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.






