- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?.. యూఎస్ సుంకాల టైంలో కీలక నిర్ణయం!
మోడీ, పుతిన్, జిన్‌పింగ్ భేటీ అవనున్నారు. యూఎస్ సుంకాల బెదిరింపుల టైంలో చైనాకు పుతిన్, మోడీని జిన్‌పింగ్ ఆహ్వానించడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీని చైనాకు ఆహ్వానించేందుకు జీ జిన్‌పింగ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. టియాంజియాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశానికి వీరితోపాటు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల నేతలను కూడా చైనాకు జిన్‌పింగ్ ఆహ్వానిస్తారట. ప్రపంచంలో కొత్త ఆర్డర్ వస్తోందనే సంకేతాన్ని యూఎస్‌కు పంపేందుకు ఈ అవకాశాన్ని చైనా ఉపయోగించుకుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తద్వారా చైనా, ఇరాన్, రష్యా, ఇండియాను కట్టడి చేసేందుకు యూఎస్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయనే సందేశాన్ని ఎస్‌సీవో మీటింగ్ ఇస్తుందని వారి అభిప్రాయం. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు ఎస్‌సీవో మీటింగ్ జరగనుంది. యూఎస్ విధానాలకు వ్యతిరేకంగా దేశాలు కలిసి రావడంతోపాటు ప్రపంచానికి మరో దిశను చూపించేలా ఈ సమావేశం ఉండబోతోందని చైనా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బ్రిక్స్ కూటమి సమావేశం తర్వాత ట్రంప్ టెన్షన్ ఎక్కువైందని, ఇప్పుడు ఎస్‌సీవో సమావేశంతో యూఎస్ టెన్షన్స్ మరింత పెరుగుతాయని నిపుణుల అభిప్రాయం.






