- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Xi Jinping: రాష్ట్రపతి ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ లేఖ.. కారణమిదే?
భారత్ చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆకాంక్షించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Jinping) ఆకాంక్షించారు. ఇరు దేశాలు సన్నిహితంగా కలిసి పని చేయాలని తెలిపారు. డ్రాగన్ ఏనుగు మధ్య రిలేషన్ షిప్స్ టాంగో నృత్యం వలె ఉండాలని పేర్కొన్నారు. చైనా-భారత్ (china India) దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadhi murmur) కు శుభాకాంక్షలు తెలియజేస్తూ జిన్‌పింగ్ మంగళవారం ఓ లేఖ రాశారు. రెండు దేశాలు శాంతి యుతంగా కలిసి పని చేయడానికి మార్గాలను కనుగొనాలని సూచించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్, చైనా భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అంతేగాక సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అనంతరం ద్రౌపది ముర్ము సైతం చైనాకు అభినందనలు తెలిపారు. స్థిరమైన, ఊహాత్మక, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాలకు, ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. కాగా, 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. పలు అంశాలపై ఇటీవల భారత్ చైనా ప్రతినిధులు భారత్‌లో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు భారత్ కు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.






