- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం.. మోహన్ భగవత్ పై రాహుల్ విమర్శలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన రోజే నిజమైన స్వాతంత్ర్యం పొందామని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన రోజే నిజమైన స్వాతంత్ర్యం పొందామని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీలో కాంగ్రెస్ (Congress) నూతన ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగానే ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్‌పై మండిపడ్డారు. ‘‘దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య ఇప్పటికీ యుద్ధం జరుగుతోంది. ఒకటి మేం పాటిస్తున్న రాజ్యాంగ సిద్ధాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం (Independence) రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బ్రిటీష్ వారిపై పోరాడిన స్వతంత్ర్య సమరయోధులందరినీ కాకుండా.. దేశ ప్రజలందరినీ అవమానించారు. ప్రతి రెండుమూడ్రోజులకొకసారి రాజ్యాంగం గురించి, స్వాతంత్ర్య ఉద్యమం గురించి తాను ఏమనుకుంటున్నారో ఆ వ్యాఖ్యలు చేస్తారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయి. ఇలాంటి కామెంట్లన్నీ ఆయన బహిరంగానే చేస్తారు. మరే దేశంలోనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి’’ అని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం (Congress New Headquarter) గురించి రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ఈ కొత్త భవనం కాంగ్రెస్ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.






