ఇంట్లో విగ్రహం పెట్టి సీఎం విజయ్‌కి పూజలు... వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విగ్రహాన్ని ఓ అభిమాని ఏకంగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. విజయ్ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయడమే కాకుండా విగ్రహానికి పూజలు సైతం చేస్తున్నాడు.

ఇంట్లో విగ్రహం పెట్టి సీఎం విజయ్‌కి పూజలు... వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విగ్రహాన్ని ఓ అభిమాని ఏకంగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. విజయ్ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయడమే కాకుండా విగ్రహానికి పూజలు సైతం చేస్తున్నాడు. తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే టీవీకే పార్టీ కార్యకర్త తన పూజ మందిరంలో విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిరోజు హారతి ఇవ్వడం, బొట్టు పెట్టి మొక్కులు తీర్చుకోవడం లాంటివి చేస్తున్నాడు. అభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. సినిమా హీరోలపై, రాజకీయనాయకులపై అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి పీక్స్ కు చేరుకోవద్దని అంటున్నారు. దేవుళ్లవి లేదా కన్న తల్లిదండ్రులవి విగ్రహాలు పెట్టుకోవాలి కానీ ఇలా అభిమాన నాయకుడి ఫోటో పెట్టుకుని మళ్లీ అది కూడా పూజ గదిలో పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్ల విగ్రహాలు పెట్టుకున్నారని కానీ వాటితో ఒరిగింది ఏం లేదని విమర్శిస్తున్నారు.

Next Story