- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాంబారులో పురుగులు.. వందేభారత్ రైలులో నాణ్యత లేని భోజనం
కేంద్ర రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల్లో నడుస్తున్నాయి. ఇక సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అలాగే, ఈ రైళ్లలో ప్రయాణించే వారికి భోజనం కూడా అందిస్తారు. దీనికోసం టికెట్ బుకింగ్ చేసేటప్పుడే భోజనంతో సహా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది.
ఓ వ్యక్తి తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ (Vande Bharat) రైలులో బుధవారం ప్రయాణించాడు. టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణ టికెట్‌తో పాటు భోజనానికి డబ్బులు చెల్లించాడు. అయితే, రైలులో సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా సాంబారులో పురుగులు కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే రైల్వే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన సిబ్బంది సదరు ప్రయాణికుడికి భోజనానికి బదులు ఇన్‌స్టంట్ నూడుల్స్ ఇచ్చి సరిపెట్టారు. అయితే తాను ఫుల్ మీల్‌కు డబ్బులు చెల్లించానని.. తనకు ఇన్సటంట్ నూడుల్స్ పెట్టి సరిపెట్టడానికి ప్రయత్నించారని ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి వందే భారత్‌లో నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నారు.






