- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం ఆగింది: బీజేపీ నేత కంగనా రనౌత్
by samatah |
హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్ మోడీ ప్రశంసలు కురిపించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్ మోడీ ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం జరగట్లేదని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయినా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెస్కీ అయినా మోడీ సలహాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాగే అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు సైతం మోడీ వైపు చూస్తున్నారని కొనియాడారు. మండి సెగ్మెంట్‌లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో కంగనా మాట్లాడారు. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్ మోడీ చొరవ వల్లే పాక్ విడుదల చేసిందని కొనియాడారు. మోడీ కారణంగా థర్డ్ వరల్డ్ వార్ ఆగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భారత్ ను ఎన్నడూ చూడ లేదని, కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Next Story






